News March 30, 2024

బీర్కూరులో బైక్ దొంగల అరెస్ట్.. 26 బైకుల స్వాధీనం

image

ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్నట్లు బీర్కూర్ SI రాజశేఖర్ తెలిపారు. మండలంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమను చూసి భయపడి పారిపోతున్న ఇద్దరిని వెంబడించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిని బోధన్‌కి చెందిన అబ్దుల్ ఐయాజ్ ఖాన్(36), సమీర్ ఉద్దీన్(18)లుగా గుర్తించారు. అనంతరం విచారణ చేయగా వారు బైక్ దొంగలని తేలింది. దీంతో వారి వద్ద ఉన్న 26 బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Similar News

News March 21, 2026

NZB: మాయమవుతున్న అడవి.. మంటగలుస్తున్న ప్రకృతి!

image

​నిజామాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గుతోంది. గత రెండు దశాబ్దాల్లో సుమారు 580 హెక్టార్ల అటవీ సంపద హరించుకుపోయింది. ముఖ్యంగా అటవీ అంచున ఉన్న గ్రామాల్లో ‘పోడు సాగు’ పెరగడం వల్ల చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వందల ఎకరాల అటవీ భూమి సాగు భూమిగా మారుతోంది. అటవీ అధికారులు నిఘా పెంచినప్పటికీ, పోడు సాగును అరికట్టడం సవాలుగా మారింది.

# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం

News March 21, 2026

NZB: పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి

image

NZB నగరంలోని పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి నిర్వహించింది. శుక్రవారం 6వ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ మిషన్ భగీరథ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నామని CCS ACP మస్తాన్ వలీ చెప్పారు. 4 సెల్ ఫోన్లు, 4 బైక్‌లు, ఒక ఆటో, రూ.11,170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించామన్నారు.

News March 20, 2026

NZB: ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత

image

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత అన్నారు. ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు మోపారని, రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దివ్యాంగులు అందరినీ మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారన్నారు.