News March 30, 2024
MDK: భార్య మందలింపు.. భర్త సూసైడ్

చిలిపిచేడ్ మం. బండపోతుగల్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేసి ఏదైనా పని చేసుకోవాలని భార్య నదియా బేగం మందలించింది. ఈ మనస్థాపంతో ఇస్మాయిల్ ఈ నెల 29న పురుగుల మందు తాగాడు. తీవ్ర అస్వస్థకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 29, 2025
ఘనపూర్ ఆనకట్టకు నీళ్లు రావు: ఈఈ శ్రీనివాస్ రావు

సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆనకట్ట (వనదుర్గ ప్రాజెక్టు) రబీ- 2025-26 ఆయకట్టుకు సంభందించి సాగునీరు విడుదల చేయబోమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ రావు సోమవారం తెలిపారు. వనదుర్గ ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, మెదక్, హవేలీఘనపూర్, పాపన్నపేట్ మండలాల్లోని ఆయకట్టు పరిధిలో గల రైతులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News December 29, 2025
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: MDK కలెక్టర్

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 64 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ భారతి 21, ఇందిరమ్మ ఇళ్లు 11, పెన్షన్లు 12, ఇతర అంశాలపై 20 దరఖాస్తులు ఉన్నాయి.
News December 29, 2025
మెదక్ స్టేడియంలో అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలు

మెదక్ అథ్లెటిక్స్ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ ప్రసన్నకుమార్ రన్ ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.కె.హుస్సేన్, రెనాగుప్త ఎన్జీవోస్ ఆర్గనైజర్ మెడల్స్ అందజేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు గచ్చిబౌలిలో రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని మెదక్ జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి మధుసూదన్ తెలిపారు.


