News July 11, 2025

ప.గో: 641.544 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Similar News

News August 31, 2025

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం వివిధ శాఖాల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రీ సర్వే, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పిజిఆర్ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు, క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు.

News August 30, 2025

శిశుమరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష

image

తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్షలో మాట్లాడారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదయ్యాయి.

News August 30, 2025

ఇండెక్స్ వెర్షన్ 2.0పై ఒక్కరోజు వర్క్ షాప్: కలెక్టర్

image

భీమవరం: కలెక్టరేట్లో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ వెర్షన్ 2.0 పై ఒక్కరోజు వర్క్ షాప్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి అనేది మానవ, సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉందన్నారు.