News March 30, 2024
బిగ్‌బాస్ విన్నర్‌పై మరో కేసు
యూట్యూబర్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌పై మరో కేసు నమోదైంది. ఓ వీడియోలో నిషేధిత పాములను వాడినందుకు అతడిపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పాము విషం విక్రయం కేసులో అతడు 5రోజులు జైలు జీవితం గడిపారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇప్పుడు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ సౌరభ్ గుప్తా ఫిర్యాదుతో మరోసారి కేసు నమోదైంది.
Similar News
News November 7, 2024
మరో వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ?
AP: మరో వారంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా కంటే రెండు మూడు రెట్ల పదవులు ఎక్కువగా ఉంటాయని సమాచారం. మొత్తం 50 BC కార్పొరేషన్‌లు ఉండగా 35 వరకు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో JSP, BJP నేతలకు కూడా కొన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు టాక్.
News November 7, 2024
క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం
నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్‌మోర్, సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. వచ్చే FEBలో భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముంది.
News November 7, 2024
శ్రీశైలంలో నీటి నిల్వ తగ్గడంపై ఆందోళన
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. <<14540990>>KRMB <<>>హెచ్చరించినప్పటికీ జల విద్యుత్ ఉత్పత్తి కోసం బుధవారం 19,820 క్యూసెక్కులను తెలుగు రాష్ట్రాలు తరలించాయి. మరో 16 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు నుంచి AP తరలించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 182.99(215.81) TMCల నీరు ఉంది. ఆల్మట్టి నుంచి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై నిపుణులు ఆక్షేపిస్తున్నారు.