News March 30, 2024
ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త!
తమ శాఖ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మొబైల్ యూజర్లకు టెలికాం శాఖ సూచించింది. సైబర్ నేరగాళ్లు విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి మొబైల్ నంబర్ నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, వ్యక్తిగత డేటా దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్, 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.
Similar News
News November 7, 2024
కులగణన సర్వే.. ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?
TG: పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభంకానుంది. ఈలోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆధార్‌లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం.
News November 7, 2024
KTRపై FIR నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం!
TG: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో KTR కార్నర్ కాబోతున్నట్లు మీడియా, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై FIR నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. ఈ అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ACBకి MAUD లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్‌పైనా చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.
News November 7, 2024
అగ్రరాజ్య అధ్యక్షుడికి సకల సౌకర్యాలు!
అమెరికా నూతన అధ్యక్షుడికి సకల సౌకర్యాలు లభిస్తాయి. ఆయనపై ఈగ వాలకుండా చూసుకునే సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. అధికారంలో ఉన్న నాలుగేళ్లు వైట్‌హౌస్‌కు అధిపతిగా ఉంటారు. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి.