News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 3, 2025
KNR: టీచర్స్ డే.. ఉత్తమ టీచర్లకు అవార్డులు..!

SEPT 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 సెలవు దినం కావడంతో వేడుకలను ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి పురస్కారాలను అందజేయనున్నారు. 43 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.
News September 3, 2025
KNR: గిరిజన యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గిరిజన యువతీ యువకులకు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని క్యారక్టేరైజేషన్ ప్రాజెక్టులో శిక్షణ కల్పించనున్నారు. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద ఈ శిక్షణ జరుగుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. ఇంజినీరింగ్ లేదా ఎంఎస్సీ చేసిన వారు అర్హులు. దరఖాస్తు కోసం https://www.cense.iisc.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News September 3, 2025
KNR: ప్రభుత్వ భూములు పరిరక్షించాలి: కలెక్టర్

KNR రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని అనధికార కట్టడాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, రాతి కడీలు, సూచిక బోర్డులు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.