News March 30, 2024
NZB: తాటి చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.
Similar News
News January 13, 2025
NZB: బడా పహాడ్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ దర్గాను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం సందర్శించారు. దర్గాకు సందల్‌తో కూడిన చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెకు బడాపహాడ్ దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి దర్గా వద్ద ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, సుమిత్రా ఆనంద్, అయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
News January 13, 2025
బోధన్ పట్టణాన్ని సందర్శించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ మొట్టమొదటి లోకాయుక్త వెంకట రాములు ఆదివారం బోధన్ పట్టణంలో పర్యటించారు. బోధన్‌లోని శివాలయం, ఎల్లమ్మ ఆలయం, శక్కర్ నగర్‌లోని రామాలయం, ఆచన్ పల్లిలోని మారుతి ఆలయాలను సందర్శించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆయనతో పాటు బోధన్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
News January 12, 2025
రేవంత్ రెడ్డి పాలన RSS రూల్ ప్రకారమే జరుగుతుంది: కవిత
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అంతా RSS రూల్ ప్రకారమే జరుగుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆరోపించారు. ఆదివారం ఆమె నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ళ కేసీఆర్ పాలనలో మతకల్లోలాల జాడ కనిపించలేదని రేవంత్ సర్కార్ ఏడాది పాలనలోనే ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కాగా హామీలలో ప్రధానమైన మైనార్టీ డిక్లరేషన్ (చెవేళ్ళ) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.