News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.
Similar News
News September 1, 2025
GNT: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు మిర్చియార్డులో విషాదం చోటుచేసుకుంది. యార్డులోకి వెళ్తున్న లోడు లారీ చక్రాల కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 1, 2025
రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు 7వ స్థానం

రాష్ట్ర EPTSలో గుంటూరు జిల్లా 7వస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 39,349 డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయగా, అందులో జీవోలు 1969, మెమోలు 800, సర్క్యులర్లు 1291, లేఖలు 14,975 ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ కోసం EPTS కీలకమని, వెనుకబడిన జిల్లాలు తక్షణం పనితీరు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.
News September 1, 2025
సిరిపురంలో రికార్డు సృష్టించిన లడ్డూ వేలం

మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు సృష్టించింది. ఈ లడ్డూ రూ. 5,01,000లకు అమ్ముడై గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. ప్రతి సంవత్సరం జరిగే వినాయక మహోత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సిరిపురం గ్రామానికి చెందిన కడియాల పరమేశ్వరరావు (అశోక్) భక్తిశ్రద్ధలతో లడ్డూను దక్కించుకున్నారు.