News July 11, 2025
కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్ గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.
Similar News
News August 31, 2025
కృష్ణా జిల్లా సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న జిల్లా సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ స్టేడియంలో ఉదయం 7 గంటలకు ఈ ఎంపికలు జరుగుతాయని అసోసియేషన్ కార్యదర్శి డి. దిలీప్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.
News August 30, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ మచిలీపట్నంలో మహిళ చెయ్యి నరికిన వ్యక్తి
☞ పదవుల ఆశించిన వారికి న్యాయం చేస్తాం: పెడన ఎమ్మెల్యే
☞ మచిలీపట్నంలో బార్ లైసెన్సులకు లక్కీ డ్రా
☞ కృష్ణా జిల్లాలో పలుచోట్ల వినాయక నిమజ్జనాలు
☞ పెడన మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం
☞ బుడమేరు వరదలకు ఏడాది పూర్తి..!
☞ నాగాయలంక వద్ద తగ్గు ముఖం పట్టిన వరద
News August 30, 2025
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: కలెక్టర్

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు మంజూరు చేయాలని తీర్మానించారు.