News July 11, 2025
కరీంనగర్: ట్రాన్స్ జెండర్లకు శుభవార్త

ట్రాన్స్జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.
Similar News
News August 31, 2025
KNR: వరద కాలువలో గల్లంతైన రహీం మృతదేహం లభ్యం

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
News August 30, 2025
KNR: ‘వయోవృద్ధుల పోషణకు ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలి’

వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అనుసరించి ట్రిబ్యునల్ ఇస్తున్న ఉత్తర్వులను పాటిస్తున్నది లేనిది పర్యవేక్షించాలన్నారు. తద్వారా వృద్ధులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు
News August 29, 2025
కరీంనగర్ ప్రతినెల 30న పౌరహక్కుల దినోత్సవం

KNR జిల్లాలో పౌరహక్కుల దినోత్సవం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ప్రతి నెల 30న జరిగే ఈ సమావేశాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరింది. సమావేశం జరిగే గ్రామం, మండలం గురించి 2 లేదా 3 రోజుల ముందు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ప్రజలు ఈ సమావేశాలలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని SC అభివృద్ధి శాఖ DD నాగైలేశ్వర్ తెలిపారు.