News March 30, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.
Similar News
News April 7, 2026
కరీంనగర్: అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

కరీంనగర్ నగరంలోని వర్క్‌షాప్ సమీపంలో ఉన్న సూర్యనగర్‌లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటి వైరింగ్, స్విచ్ బోర్డులు పూర్తిగా కాలిపోయాయి.
News April 6, 2026
KNR: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, ఆర్డీవోలు రమేశ్ బాబు, మహేశ్వర్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 233 దరఖాస్తులు వచ్చాయి.
News April 6, 2026
హుజురాబాద్, జమ్మికుంటలో పేలుడు పదార్థాల అక్రమ దందా!

హుజురాబాద్, జమ్మికుంట కేంద్రంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఎక్స్ ప్లోజివ్స్ దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌ప్లోజివ్స్, డిటోనేటర్లను ఒకే వాహనంలో తరలిస్తూ వ్యాపారులు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలకే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉన్నా, రద్దీప్రాంతాల గుండా ఈ అక్రమ దందా సాగుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే కిలోమీటర్ల మేర విధ్వంసం తప్పదని తెలిసినా.. అధికారులు పట్టించుకోవట్లేదు.


