News July 11, 2025
ప్రొద్దుటూరు: రూ.కోట్లతో రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణం.. అటవీ శాఖ అభ్యంతరం

రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి అటవీశాఖ నుంచి బ్రేక్ పడింది. అప్రోచ్ రోడ్లు RFలోకి వస్తున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. స్థానిక రామేశ్వరం పెన్నా నదిపై రూ.53కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. MDR గ్రాంట్ స్కీమ్ నిధులతో ప్రొద్దుటూరు- RTPP మార్గంలో R&B బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 65% పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్రోచ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పనికి బ్రేక్ పడింది.
Similar News
News September 1, 2025
చక్రాయపేట: నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం

కడప జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చక్రాయపేట మండలం మహాదేవపల్లె వాసులు గ్రామంలో గణనాథుని ఊరేగించి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 31, 2025
సెప్టెంబర్ 2న కొప్పర్తికి రానున్న మంత్రి లోకేశ్

మంత్రి లోకేశ్ సెప్టెంబర్ 2న కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను సందర్శిస్తారని వారు తెలిపారు. కొప్పర్తికి త్వరలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు.
News August 31, 2025
రేపు పులివెందుల రానున్న YS జగన్

కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించానున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నానికి పులివెందుల చేరుకోనున్న జగన్, రెండో తేదీ ఉదయం తన తండ్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలలో నివాళులర్పిస్తారు. అనంతరం లింగాల మండలం అంబకంపల్లి చేరుకొని జలహారతిలో పాల్గొంటారు. పులివెందుల చెరుకుని రాత్రికి బస చేసి మూడవ తేదీ ఉదయం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.