News July 11, 2025
అల్లూరి: ‘రూ.1,000 కోట్లతో అభివృద్ధి’

పాడేరు కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలానికి 100 గోకులాల ఏర్పాటు, ROFR పట్టాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా పది కుటుంబాలకు స్వయంగా మార్గదర్శిగా నిలిచారు. ఆర్గానిక్ వ్యవసాయం, పర్యాటక అభివృద్ధి, రూ.1000 కోట్లతో రహదారి, ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
Similar News
News August 31, 2025
ఒకే గ్రామంలో 8 మందికి టీచర్ ఉద్యోగాలు

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.
News August 31, 2025
మైనర్లకు వాహనాలిస్తే రూ.లక్ష జరిమానా!

TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.
News August 31, 2025
WNP: బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి

బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లుకు బీఆర్ఎస్, బీజెపి సహకరించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి. కాంగ్రెస్ కేంద్రంలో పవర్లో ఉన్నప్పుడే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది. బీసీ మంత్రిపై బీఆర్ఎస్ బీసీ నేత తప్పుగా మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.