News August 4, 2025

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి రాంప్రసాద్

image

AP: ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ని ప్రారంభించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. 6,700 బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించాం. ఇందుకోసం రూ.1,950 కోట్లు ఖర్చు అవుతుంది’ అని మంత్రి అన్నారు.

Similar News

News August 16, 2025

‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఆందోళన.. మీ కామెంట్?

image

TG: <<17419574>>మార్వాడీలు<<>> వ్యాపారం చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు వేగంగా విస్తరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అని నినదిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. క్వాలిటీతో పాటు మంచి సర్వీస్ అందిస్తే ఎవరికైనా లాభాలు వస్తాయంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 16, 2025

దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారు.. KCRపై రేవంత్ సెటైర్

image

TG: దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారని సీఎం రేవంత్ BRS చీఫ్ KCRపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణ పేరు, పేగు బంధం కూడా తెంచుకున్నారని తెలిపారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవాన్ని పెంచామని ఓ పుస్తకావిష్కరణ సభలో చెప్పారు.

News August 16, 2025

బ్రెవిస్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్.. CSK క్లారిటీ

image

IPL-2025లో ఆడేందుకు <<17405212>>బ్రెవిస్‌కు<<>> ఎక్స్‌ట్రా పేమెంట్ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ అశ్విన్ వ్యాఖ్యలపై CSK స్పందించింది. ‘టోర్నీ నియమాలకు లోబడే గాయపడిన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను తీసుకున్నాం. రూల్ ప్రకారం రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌కు ఇంజూర్డ్ ప్లేయర్‌కు ఇవ్వాల్సిన ఫీ కంటే ఎక్కువ ఇవ్వొద్దు. దాని ప్రకారమే వేలంలో గుర్జప్నీత్‌ను కొన్న ధరనే (₹2.2Cr) బ్రెవిస్‌కు చెల్లించాం’ అని స్పష్టం చేసింది.