News August 4, 2025
ఆగస్టు15 వేడుకలు దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలి: కలెక్టర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాల ప్రదర్శన ఉండాలని ఆమె సూచించారు. వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News August 6, 2025
ప్లాట్ల క్రమబద్ధీకరణకు గడువు పొడగింపు: కలెక్టర్

అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం జీవో నంబర్ 134 ద్వారా అవకాశం కల్పించిందని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధ్రువీకరణ అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందన్నారు.
News August 5, 2025
బంగారు కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
News August 5, 2025
రాజమండ్రి: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వంగా గీత తదితరులు పాల్గొన్నారు.