News August 4, 2025
కృష్ణా: ‘CSR నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయండి’

జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సీఎస్ఆర్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు త్వరితంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 5, 2025
కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.

ఉమ్మడి కృష్ణా నుంచి జాతీయ అవార్డులు పొందేది వీరే..!

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. మైలవరం లక్కిరెడ్డి హనుమ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి దేవానంద్ కుమార్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రొఫెసర్ విజయలక్ష్మి కాశీనాథ్ ఢిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందుకోనున్నారు.