News August 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 5, 2025
తగ్గేదేలే అన్న భారత్

టారిఫ్స్‌పై అమెరికాకు <<17305975>>భారత<<>> విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని అక్కసు వెళ్లగక్కుతున్న అగ్రరాజ్యం.. యురేనియం, పల్లాడియం, కెమికల్స్ ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. తాము ఆయిల్ కొనడం వల్లే గ్లోబల్ ఎకానమీ స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. జాతీయ అవసరాల కంటే ఏదీ తమకు ఎక్కువ కాదని భారత్ అమెరికాకు తేల్చి చెప్పింది.
News August 5, 2025
వారికి ఇంటి వద్దకే రేషన్: మంత్రి మనోహర్

AP: కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.
News August 5, 2025
42% రిజర్వేషన్ల కోసం నేటి నుంచి ఢిల్లీలో నిరసనలు

TG: BCలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచిస్తోంది. ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ MPలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు. 7న CM, మంత్రులు, MPలు, MLAలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.