News August 5, 2025

పవన్ సార్.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే: హరీశ్ శంకర్

image

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో షూటింగ్ పూర్తయినట్లు హరీశ్ తాజాగా ప్రకటించారు. ‘మాటిస్తే నిలబెట్టుకుంటారు. మాట మీదే నిలబడతారు. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది’ అని పేర్కొంటూ హీరోతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. పవన్ అందించిన ఎనర్జీ, సపోర్ట్‌తో షూటింగ్‌‌ను పూర్తి చేశామన్నారు.

Similar News

News August 5, 2025

42% రిజర్వేషన్ల కోసం నేటి నుంచి ఢిల్లీలో నిరసనలు

image

TG: BCలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచిస్తోంది. ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ MPలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు. 7న CM, మంత్రులు, MPలు, MLAలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.

News August 5, 2025

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..

image

బ్రహ్మ ముహూర్తం రోజూ ఉ.3.45 గం. నుంచి ఉ.5.30 వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
*ఈ సమయంలో నిద్రలేచి కుడి నాసికా రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి.
*ఈ సమయంలో చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓం మంత్రాన్ని జపించడం వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది.
*కాలుష్యం ఉండదు కాబట్టి వాకింగ్, జాగింగ్ చేసేందుకు మంచి సమయం.

News August 5, 2025

మేం పార్టీ మారట్లేదు: BRS మాజీ ఎమ్మెల్యేలు

image

TG: తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. పార్టీ అధినేత KCR, KTR ఆశీస్సులతో BRSలోనే కొనసాగుతూ పార్టీ పటిష్ఠత కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే <<17302178>>గువ్వల బాలరాజు<<>> నిన్న BRSకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు BRS మాజీ ఎమ్మెల్యేలు BJPలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.