News August 5, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్: DGP

AP: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు DGP హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 నుంచి 17 వరకు హై స్పీడ్, 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై డ్రైవ్‌లు చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు బ్లాక్ స్పాట్‌లను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టనున్నారు.
Similar News
News August 17, 2025
నేటి నుంచి రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఇది ససరాం నుంచి ప్రారంభమై 16రోజుల పాటు 25 జిల్లాల మీదుగా సాగనుంది. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ తమ విధానమని చెబుతున్న రాహుల్.. బిహార్‌లో SIRను వ్యతిరేకిస్తూ యాత్రకు సిద్ధమయ్యారు. 1,300KM మేర సాగే ఈ యాత్ర కొంతదూరం కాలినడకన, మరికొంత దూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్‌లో సాగనుంది. మహాఘట్ బంధన్ నేతలు ఇందులో పాల్గొననున్నారు.
News August 17, 2025
నేడే లాస్ట్.. IBలో 4,987 ఉద్యోగాలు

కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల <
News August 17, 2025
నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

APలో నేటి నుంచి 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. TGలోని కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని IMD తెలిపింది.