News August 5, 2025
మేం పార్టీ మారట్లేదు: BRS మాజీ ఎమ్మెల్యేలు

TG: తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. పార్టీ అధినేత KCR, KTR ఆశీస్సులతో BRSలోనే కొనసాగుతూ పార్టీ పటిష్ఠత కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే <<17302178>>గువ్వల బాలరాజు<<>> నిన్న BRSకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు BRS మాజీ ఎమ్మెల్యేలు BJPలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News August 5, 2025
దేశంలో 60% సంపద 1% కుబేరుల చేతుల్లోనే..

భారతదేశ సంపదలో 60% కేవలం ఒక శాతం సంపన్నుల దగ్గరే ఉందని అమెరికాకు చెందిన Bernstein రిపోర్ట్ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కుటుంబాల సంపద $19.6 ట్రిలియన్లు కాగా అందులో $11.6 ట్రిలియన్లు కుబేరుల వద్దే ఉందని తెలిపింది. ఇందులో $2.7 ట్రిలియన్ల సంపద మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీలు, బ్యాంకుల్లో పెట్టుబడులుగా పెట్టగా, మిగతా $8.9 ట్రిలియన్లు రియల్ ఎస్టేట్, బంగారం, నగదు రూపకంగా ఉంచారని చెప్పింది.
News August 5, 2025
ఉదయం పెళ్లి.. రాత్రి నవ వధువు ఆత్మహత్య

AP: సత్యసాయి జిల్లాలో ఓ నవ వధువు శోభనం గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సోమందేపల్లికి చెందిన హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగేంద్రతో నిన్న ఉదయం వివాహం జరిగింది. యువతి ఇంట్లో కుటుంబసభ్యులు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
News August 5, 2025
ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్.. ఆ రూల్ ఛేంజ్!

AP: ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్లకు 3kmsలోపు ఉన్న స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారు. ఇకపై 3-5kms దూరంలో ఉన్న స్కూళ్లలోనూ కేటాయించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల తల్లులకు ఇప్పటికే ‘తల్లికి వందనం’ వచ్చి ఉంటే ఫీజులు వారే చెల్లించాలని తెలిపింది.