News August 5, 2025
‘కాళేశ్వరం’లో బాధ్యులు వీళ్లే: ఘోష్ కమిషన్

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 22 మంది పేర్లను ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ <<17303251>>కమిషన్<<>> సిఫార్సు చేసింది. వీరిలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, స్మితా సబర్వాల్, ఎస్.కె.జోషి, మురళీధర్, ఇంజినీర్లు హరిరామ్, వెంకటేశ్వర్లు, నరేందర్, ఫైనాన్స్ కార్యదర్శులు, ఇరిగేషన్ కార్యదర్శులు, కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఉన్నారు.
Similar News
News August 17, 2025
నేటి నుంచి రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఇది ససరాం నుంచి ప్రారంభమై 16రోజుల పాటు 25 జిల్లాల మీదుగా సాగనుంది. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ తమ విధానమని చెబుతున్న రాహుల్.. బిహార్‌లో SIRను వ్యతిరేకిస్తూ యాత్రకు సిద్ధమయ్యారు. 1,300KM మేర సాగే ఈ యాత్ర కొంతదూరం కాలినడకన, మరికొంత దూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్‌లో సాగనుంది. మహాఘట్ బంధన్ నేతలు ఇందులో పాల్గొననున్నారు.
News August 17, 2025
నేడే లాస్ట్.. IBలో 4,987 ఉద్యోగాలు

కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల <
News August 17, 2025
నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

APలో నేటి నుంచి 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. TGలోని కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని IMD తెలిపింది.