News August 5, 2025

BRSకు కష్టకాలం!

image

TG: ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న BRSను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ రిపోర్టుపై ఉభయసభల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈ నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News August 5, 2025

కేసీఆర్‌ను హింసించడమే రేవంత్ ఉద్దేశం: హరీశ్ రావు

image

TG: కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై కమిషన్ల పేరుతో రేవంత్ రెడ్డి వరుస సీరియళ్లు నడుపుతున్నారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎలాగైనా కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశమని ఫైరయ్యారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడం తప్ప రాష్ట్రానికి సీఎం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టకుండా చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు నీళ్లు ఇవ్వాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు.

News August 5, 2025

YS వివేకా హత్య కేసు విచారణ పూర్తి: సీబీఐ

image

AP: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తయిందని CBI సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారించింది. కానీ వివేకా కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

News August 5, 2025

పూర్తి నివేదిక వస్తే అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం: హరీశ్ రావు

image

TG: కాళేశ్వరంపై పూర్తి నివేదిక బయటపెడితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హరీశ్ రావు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే కాళేశ్వరం అక్రమాలు అంటూ తప్పుడు నివేదికలు తీసుకొచ్చారని ఆరోపించారు. నిన్నటి నివేదిక అబద్ధాలు, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఉందని ఫైరయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పాలనను సీఎం రేవంత్ గాలికి వదిలేశారన్నారు.