News August 5, 2025
నేడు తాడేపల్లిలో వైసీపీ సమావేశం

AP: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో YCP చీఫ్ జగన్ ఆ పార్టీ నేతలతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. తాజా రాజకీయ అంశాలు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై ఆయన వారితో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
Similar News
News August 5, 2025
కేసీఆర్‌ను హింసించడమే రేవంత్ ఉద్దేశం: హరీశ్ రావు

TG: కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై కమిషన్ల పేరుతో రేవంత్ రెడ్డి వరుస సీరియళ్లు నడుపుతున్నారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎలాగైనా కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశమని ఫైరయ్యారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడం తప్ప రాష్ట్రానికి సీఎం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టకుండా చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు నీళ్లు ఇవ్వాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు.
News August 5, 2025
YS వివేకా హత్య కేసు విచారణ పూర్తి: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తయిందని CBI సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారించింది. కానీ వివేకా కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
News August 5, 2025
పూర్తి నివేదిక వస్తే అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం: హరీశ్ రావు

TG: కాళేశ్వరంపై పూర్తి నివేదిక బయటపెడితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హరీశ్ రావు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే కాళేశ్వరం అక్రమాలు అంటూ తప్పుడు నివేదికలు తీసుకొచ్చారని ఆరోపించారు. నిన్నటి నివేదిక అబద్ధాలు, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఉందని ఫైరయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పాలనను సీఎం రేవంత్ గాలికి వదిలేశారన్నారు.