News August 5, 2025
ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య

తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురంలో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, కొడుకును గదిలో బంధించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పుల కారణంగానే కూతుళ్లను హతమార్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News August 6, 2025
EP28: వీటికి దూరంగా ఉండాలి: చాణక్య నీతి

ఉన్నత స్థానం పొందాలన్నా గౌరవంగా బతకాలన్నా 3 విషయాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఇతరుల ముందు తమను తాము ప్రశంసించుకోవద్దు. దీని వల్ల సమాజంలో వారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకాన్ని కోల్పోతారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఎదుటి వారిలో తప్పులు వెతకడం మానుకోవాలి. ఇతరుల్లో తప్పులు వెతికేవారు తమలోని తప్పుల్ని తెలుసుకోలేరు’ అని బోధిస్తోంది.
News August 6, 2025
రాబోయే కొన్ని గంటల్లో వర్షం

TG: రాబోయే కొన్ని గంటల పాటు GHMC పరిధిలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 2-3 గంటల్లో మేడ్చల్, గద్వాల్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 కి.మీ కంటే తక్కువ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా HYDతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News August 6, 2025
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారితోనూ చాట్ చేయొచ్చు!

వాట్సాప్‌లో త్వరలో ‘గెస్ట్ చాట్’ పేరిట కొత్త ఫీచర్ రానుంది. దీని సాయంతో వాట్సాప్ అకౌంట్ లేని వారితో చాట్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఆ కాంటాక్ట్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్/ఈమెయిల్/ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇన్విటేషన్ లింక్ పంపాల్సి ఉంటుంది. అయితే ఈ చాట్ ద్వారా మీడియా ఫైల్స్ పంపేందుకు, ఆడియో/వీడియో కాల్స్ చేసేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.