News August 5, 2025

బాన్సువాడ: తారాస్థాయికి వర్గపోరు

image

బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడంతో బాన్సువాడలో వర్గపోరుకు ఆజ్యం పడింది. పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, మాజీ MLA, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. మంత్రిసీతక్క సాక్షిగా చందూర్లో ఇరువర్గాలు రెచ్చిపోవడం అధిష్టానం దృష్టికి వెళ్లింది.

Similar News

News September 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు.

News September 10, 2025

నిజామాబాద్: వృద్ధురాలి హత్య

image

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2025

NZB: కళాశాలకు హాజరు కాని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: DIEO

image

ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్‌లోనే హాజరు తీసుకోవాలని DIEO తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల, బోధనేతర సిబ్బందితో సమీక్షించారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కానీ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.