News March 31, 2024

వేల మంది ప్రాణాలు కాపాడిన లోకో‌పైలట్

image

లోకోపైలట్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై హైవోల్టేజ్ విద్యుత్ లైన్ పడి ఉండటాన్ని గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. కర్ణాటకలోని తుమూకూరు(D)లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ హాసన్‌కు బయలుదేరగా కుణిగల్ సమీపంలోని ట్రాక్‌పై విద్యుత్ తీగ పడి ఉంది. లోకో‌పైలట్ గమనించి రైలుని నిలిపివేశాడు. దీంతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

Similar News

News March 22, 2026

రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

image

TG: CM హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గానికి రావాల్సిన ₹1,000 కోట్ల నిధులు ఆగిపోయాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.

News March 22, 2026

UAEపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. అసలు ప్లాన్ ఇదే!

image

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు UAEని మంటల్లోకి నెట్టింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం అందుకున్న $5.2 ట్రిలియన్ల పెట్టుబడుల్లో సింహభాగం (27%) UAE నుంచే వచ్చాయి. అందుకే ఆ దేశంపై దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ పరోక్షంగా దెబ్బతీస్తోంది. ప్రపంచ పెట్టుబడుల హబ్‌గా ఎదిగిన దుబాయ్ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాలపై నమ్మకం పోయేలా చేయడం ఇరాన్ వ్యూహం.

News March 22, 2026

నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.