News August 5, 2025
APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలో 42 ఏపీపీ (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులకు ఏదైనా డిగ్రీతోపాటు లా సర్టిఫికెట్ ఉండాలి. ఇంటర్ తర్వాత లా పూర్తి చేసినవారు కూడా అర్హులే. క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి. 42 ఏళ్లలోపువారు అర్హులు. OC, BC అభ్యర్థులు రూ.600, SC, ST అభ్యర్థులు రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. SEP 7లోగా <
Similar News
News August 6, 2025
ఈ పోరాటం TGదే కాదు.. భారతీయులందరిది: రాహుల్

BC రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఈ ఫైట్ కేవలం TG కోసమే కాదు.. అణగారిన వర్గాల్లోని ప్రతి భారతీయుడికీ అధికారంలో భాగస్వామ్యం, పురోగతి కోసం జరుగుతున్న సమష్టి పోరాటమిది. రాష్ట్రపతి దీన్ని పరిశీలించి ఆమోదిస్తారని ఆశిస్తున్నా. BC రిజర్వేషన్ల చట్టం సామాజిక న్యాయానికి నాంది పలుకుతుంది. ఇందుకోసమే కాంగ్రెస్ ధర్నా చేపట్టింది’ అని వ్యాఖ్యానించారు.
News August 6, 2025
దాహంతో అల్లాడుతున్న గాజా ప్రజలు

ఆకలితో అలమటిస్తోన్న గాజా ప్రజలను నీటి సంక్షోభం వెంటాడుతోందని రాయిటర్స్ పేర్కొంది. యుద్ధ నేపథ్యంలో చాలా పైప్‌లైన్లు పగిలిపోయాయని, జలాశయాలు కలుషితమవడంతో గాజా ప్రజలకు రోజుకు 3-5 లీటర్లే లభిస్తున్నట్లు తెలిపింది. NGOలు డీశాలినేషన్ యూనిట్ల ద్వారా నీరందిస్తున్నాయి. కుటుంబాలు గంటల తరబడి క్యూలో నిలబడి నీటిని పొందుతున్నాయి. కాగా, ఈజిప్టు నుంచి నీటిని తెచ్చేందుకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి.
News August 6, 2025
డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి భేటీ

TG: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. మంత్రి పదవి రాక అసంతృప్తితో ఉన్న ఆయన డీకేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తమ మధ్య పదవులు, రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని రాజగోపాల్ తెలిపారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అందుకే కలుసుకున్నామని చెప్పడం గమనార్హం.