News August 5, 2025
YS వివేకా హత్య కేసు విచారణ పూర్తి: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తయిందని CBI సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారించింది. కానీ వివేకా కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Similar News
News August 6, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
News August 6, 2025
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం (2,258 రోజులు) కేంద్ర హోంమంత్రిగా పని చేసిన నేతగా నిలిచారు. 2019 మే 20న పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయన అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎల్.కె. అద్వానీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. వాజ్‌పేయి హయాంలో అద్వానీ 2,256 రోజులపాటు హోమ్ మినిస్టర్‌గా పనిచేశారు.
News August 6, 2025
నార్త్ అమెరికా బుకింగ్స్‌లో లీడ్‌లో ‘కూలీ’

రజినీకాంత్ ‘కూలీ’, హృతిక్-NTR నటించిన ‘WAR-2’ సినిమాలు ఒకే రోజున (AUG 14) విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా ప్రీమియర్స్ బుకింగ్స్‌లో ‘వార్-2’ కంటే ‘కూలీ’ లీడ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 44,159 టికెట్ల బుకింగ్‌తో ‘కూలీ’ ప్రీ సేల్స్ $1.16Mకి చేరాయి. ‘వార్-2’ ప్రీ సేల్స్ $213.3Kగా ఉన్నాయి. ‘వార్-2’తో పోలిస్తే ‘కూలీ’ బుకింగ్స్ దాదాపు 6 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.