News August 5, 2025
కేసీఆర్‌ను హింసించడమే రేవంత్ ఉద్దేశం: హరీశ్ రావు

TG: కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై కమిషన్ల పేరుతో రేవంత్ రెడ్డి వరుస సీరియళ్లు నడుపుతున్నారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎలాగైనా కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశమని ఫైరయ్యారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడం తప్ప రాష్ట్రానికి సీఎం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టకుండా చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు నీళ్లు ఇవ్వాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు.
Similar News
News August 6, 2025
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం (2,258 రోజులు) కేంద్ర హోంమంత్రిగా పని చేసిన నేతగా నిలిచారు. 2019 మే 20న పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయన అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎల్.కె. అద్వానీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. వాజ్‌పేయి హయాంలో అద్వానీ 2,256 రోజులపాటు హోమ్ మినిస్టర్‌గా పనిచేశారు.
News August 6, 2025
నార్త్ అమెరికా బుకింగ్స్‌లో లీడ్‌లో ‘కూలీ’

రజినీకాంత్ ‘కూలీ’, హృతిక్-NTR నటించిన ‘WAR-2’ సినిమాలు ఒకే రోజున (AUG 14) విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా ప్రీమియర్స్ బుకింగ్స్‌లో ‘వార్-2’ కంటే ‘కూలీ’ లీడ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 44,159 టికెట్ల బుకింగ్‌తో ‘కూలీ’ ప్రీ సేల్స్ $1.16Mకి చేరాయి. ‘వార్-2’ ప్రీ సేల్స్ $213.3Kగా ఉన్నాయి. ‘వార్-2’తో పోలిస్తే ‘కూలీ’ బుకింగ్స్ దాదాపు 6 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
News August 6, 2025
పారాసెటమాల్ టాబ్లెట్లను నిషేధించలేదు: కేంద్రం

పారాసెటమాల్ టాబ్లెట్లపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ట్యాబ్లెట్లను బ్యాన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటు సమావేశాల్లో తెలిపారు. అయితే పారాసెటమాల్‌తో ఇతర ఔషధాలను కలిపి తయారు చేసిన కొన్ని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లను గతంలో బ్యాన్ చేసినట్లు పేర్కొన్నారు. CDSCO <