News August 5, 2025
రాజమండ్రి: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వంగా గీత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 6, 2025
రాజమండ్రి: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. ప్రశాంతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజమండ్రిలో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. 2026 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను అనుసరించి, వారికి సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
News August 6, 2025
తూ. గో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

అసాంఘిక కార్యకలాపాలను అణిచివేసేందుకు మంగళవారం తూ.గో జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జోనల్ డీఎస్పీలు, సిబ్బంది టీములుగా ఏర్పడి తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటు సారా, నంబర్, రికార్డులు లేని 193 ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ హెచ్చరించారు.
News August 6, 2025
ప్లాట్ల క్రమబద్ధీకరణకు గడువు పొడగింపు: కలెక్టర్

అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం జీవో నంబర్ 134 ద్వారా అవకాశం కల్పించిందని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధ్రువీకరణ అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందన్నారు.