News August 5, 2025
ఈ బామ్మకు 114 ఏళ్లు.. హెల్త్ సీక్రెట్ ఇదే!

114 ఏళ్ల షెగేకో కగవా జపాన్‌లో అత్యంత ఎక్కువ వయసున్న వృద్ధ పౌరురాలిగా గుర్తింపు పొందారు. ఈమె గైనకాలజిస్టుగా పని చేసి 86 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యారు. ‘నేను డ్యూటీ చేసినప్పుడు ఇప్పుడు ఉన్నంతగా కార్లు లేవు. రోజూ నడుచుకుంటూ వెళ్లేదాణ్ని. అందుకే ఆరోగ్యంగా ఉన్నానేమో. నాకిష్టమైనవి తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తింటాను. నాలో చాలా ఎనర్జీ ఉంది’ అని చెప్పారు. కగవా 1911లో జన్మించారు.
Similar News
News August 6, 2025
ఇవాళ క్యాబినెట్ సమావేశం

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉ.11 గంటలకు జరిగే ఈ సమావేశంలో నాలా చట్టం రద్దు బిల్లు, కొత్త బార్ పాలసీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే P-4 కార్యక్రమం, చేనేతలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
News August 6, 2025
‘మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారమా’?

ట్రంప్ వ్యవహార శైలి ‘మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం’ అన్న చందంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా రష్యా నుంచి $24.51 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లో $3 బిలియన్ల బిజినెస్ చేసింది. కానీ భారత్ ఆయిల్ దిగుమతి వల్లే రష్యాకు డబ్బులు వస్తున్నాయని, అందుకే యుద్ధం కొనసాగిస్తోందని ట్రంప్ చెబుతున్నారు.
News August 6, 2025
IPOకు టాటా క్యాపిటల్

పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు టాటా సన్స్ ఆధ్వర్యంలోని టాటా క్యాపిటల్ సంస్థ సెబీ వద్ద డాక్యుమెంట్లు సమర్పించింది. IPOలో భాగంగా 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇందులో 21 కోట్ల షేర్లను తాజాగా, మిగతా 26.58 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. ఈ IPO ద్వారా ₹17,400 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. SEBI వద్ద దాఖలు చేసిన డాక్యుమెంట్లలో సంస్థ విలువ ₹96,000crగా పేర్కొంది.