News March 31, 2024

ఖమ్మం: ఒక్క పోస్టుకు 71 మంది పోటీ

image

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ భర్తీకి శనివారం రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకున్న 84 మందిలో 71 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షను పర్యవేక్షించిన డిప్యూటీ సూపరిండెంట్ బి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేస్తామని తెలిపారు.

Similar News

News April 23, 2025

ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News April 23, 2025

ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.

News April 23, 2025

KMM: ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందొద్దు: DEO

image

జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయని, కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DEO సోమశేఖర్ వర్మ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజును పట్టించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఫెయిల్ అయ్యామని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించి సరైన సూచనలు ఇవ్వాలని కోరారు.

error: Content is protected !!