News August 5, 2025
‘సీతారామం’ విడుదలకు మూడేళ్లు.. నిర్మాత స్పెషల్ మెసేజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన వింటేజ్ లవ్ స్టోరీ ‘సీతారామం’ విడుదలై నేటికి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత స్వప్న దత్ ₹100 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘ఈ సినిమా ₹100 కోట్లను చేరుకుంటుందని ఈ పోస్టర్ రూపొందించాం. కానీ రూ.97కోట్ల వద్దే ఆగిపోయింది. నంబర్‌తో సంబంధం లేదని మూడేళ్లకు గ్రహించాం’ అని పోస్ట్ చేశారు.
Similar News
News August 6, 2025
పీఎం కిసాన్ పెంచుతారా? మంత్రి ఏమన్నారంటే?

పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచే ఆలోచన లేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. కౌలుదారులకూ ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తారా? అనే ప్రశ్నకు వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. కేవలం భూమిని కలిగి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుందని, విస్తరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 20 విడతల్లో రూ.3.9 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
News August 6, 2025
బోడ కాకరకాయ తింటున్నారా?

వర్షాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే వాటిలో బోడ కాకరకాయ/ఆకాకర/అడవి కాకర ఒకటి. ఇవి బీడు భూములు, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిలో బి1, బి2, బి3 విటమిన్లతో పాటు కాల్షియం, పొటాషియం ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే రక్తపోటు, షుగర్ స్థాయులు అదుపులో ఉండటమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రస్తుతం వీటి ధర ప్రాంతాన్ని బట్టి కిలో రూ.200-400గా ఉంది.
News August 6, 2025
OTT రిలీజ్‌పై స్పందించిన ‘మహావతార్ నరసింహ’ మేకర్స్

‘మహావతార్ నరసింహ’ సెప్టెంబర్/అక్టోబర్‌లో OTTలోకి వస్తుందన్న ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు. ‘ప్రస్తుతానికి మా సినిమా థియేటర్లలో అందుబాటులో ఉంది. ఇంకా ఏ OTT సంస్థతో డీల్ చేసుకోలేదు. మా అఫీషియల్ సోషల్ హ్యాండిల్స్‌లో వచ్చే అప్‌డేట్స్ మాత్రమే నమ్మండి’ అని నిర్మాణ సంస్థ ‘క్లీమ్ ప్రొడక్షన్స్’ ట్వీట్ చేసింది. జులై 25న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లతో <<17308161>>రికార్డులు<<>> సృష్టిస్తోంది.