News August 5, 2025

జిల్లా కలెక్టర్‌తో ఐటీడీఏ పీవో భేటీ

image

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఐటీడీఏ పీవో మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 7, 2025

నేడు కలెక్టరేట్‌లో టెస్కో స్టాల్ ఏర్పాటు

image

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో టెస్కో స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విక్రయాల్లో అన్ని రకాల వస్త్రాలపై 30 శాతం, రాజ్కోట్ ఇక్కత్ సిల్క్ చీరలపై 40 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుందని తెలిపారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

News August 6, 2025

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44%కు పెంచాలి: తుమ్మల

image

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మల సీతారామన్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల ఆగస్టు కేటాయింపులతో కలిపి వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

News August 6, 2025

ATC కోర్సులతో ఉపాధి భరోసా: కలెక్టర్

image

యువతకు ATC కోర్సులతో ఉద్యోగాలకు భరోసా లభిస్తుందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను అప్ గ్రేడ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మారుతున్న కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నిష్ణాతులైన ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.