News March 31, 2024

HYD: ఎయిర్‌పోర్టు ప్రవేశమార్గం వరకు ఏసీ బస్సులు

image

HYD నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ ఏసీ పుష్పక్ బస్సులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రవేశం మార్గం వరకు వెళ్లనున్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే 49 ఏసీ బస్సులు అరైవల్స్‌తో పాటు డిపార్చర్స్ వద్ద కూడా ఆగనున్నాయి.

Similar News

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.

News March 6, 2026

HYD: నీరు వృథా.. ఖజానా ఖాళీ!

image

జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.

News March 5, 2026

HYDలో ఇక ‘RED’ నోటీసులు

image

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.