News August 5, 2025

ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు త్వరలో రివ్యూ

image

AP: TDP MLAల పనితీరుపై పార్టీ చీఫ్ చంద్రబాబు త్వరలో రివ్యూ చేయనున్నారు. IVRS కాల్స్, ఇంటెలిజెన్స్, పార్టీ చేసిన 2సర్వేల రిపోర్టు ఆధారంగా ఈ రివ్యూ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. ఓవరాల్ రిపోర్టులో రెడ్ జోన్‌లోని టాప్-20లో ఇప్పటికే కొందరితో రివ్యూ జరిగింది. త్వరలోనే మిగతా నేతలతో సమీక్షలు జరుపుతారని సమాచారం. ఇంప్రూవ్‌మెంట్ కోసం 3నెలలు టైం ఇచ్చి మారకుంటే చర్యలు తీసుకునే అవకాశముంది.

Similar News

News August 6, 2025

నిద్రపోయే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

వర్షాకాలంలో నిద్రపోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘నిద్రపోయే ముందు చల్లటి నీరు/పానియాలు తాగకూడదు. దానివల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాళ్లు పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావొచ్చు. గదిలో తేమ ఉంటే.. బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యాల బారిన పడొచ్చు. దోమకాటుకు కూడా గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.

News August 6, 2025

కోర్టుకు ఏం చెప్పాలనేదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు!

image

TG: సెప్టెంబర్‌ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నెలన్నర క్రితం హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం పంపిన BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఎటూ తేల్చలేదు. రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న సర్కారు హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. తాజాగా CS రామకృష్ణారావు న్యాయనిపుణులతో భేటీ అయి కోర్టును మరింత సమయం కోరే అంశాలపై చర్చించారు.

News August 6, 2025

ఖాతాదారులకు HDFC బ్యాంక్ హెచ్చరికలు

image

APK ఫైల్ స్కామ్‌పై HDFC బ్యాంక్ తమ ఖాతాదారులను హెచ్చరించింది. ‘స్కామర్లు మీకు బ్యాంకు సిబ్బందిలా APK ఫైల్స్ పంపుతారు. అవి డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాలవుతుంది. మీ కాల్స్, డేటా వారికి చేరుతుంది. రీ-కేవైసీ, పెండింగ్ చలాన్లు, ట్యాక్స్ రిటర్న్స్ అని వచ్చే లింక్స్ క్లిక్ చేయకండి. థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి. మోసపూరిత లింక్స్, మెసేజులు వస్తే రిపోర్ట్ చేయండి’ అని సూచించింది.