News August 5, 2025
పారా అథ్లెటిక్స్‌లో సత్తా చాటాలి: కలెక్టర్

విశాఖ వేదికగా పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో ఆగష్టు 9న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్, సబ్-జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పోటీల గోడ పత్రికను కలెక్టర్ హరీంద్రప్రసాద్ ఆవిష్కరించారు. విశాఖ వేదికగా జరిగే ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు.
Similar News
News August 6, 2025
అప్పికొండలో కొట్లాట.. ఐదుగురికి గాయాలు

పెదగంట్యాడ మండలం అప్పికొండ గ్రామంలోని స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారు ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో రౌడీ షీటర్ గరికిన గంగరాజు, అతని కుమారుడు కోటేశ్వరరావు, గంగరాజు అక్క బంగారమ్మ అతని భర్త కోటేశ్వరరావు గాయపడ్డారు. గాయపడ్డవారిని దువ్వాడ పోలీసులు హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
News August 6, 2025
విశాఖ: నేడే ఎన్నిక.. బరిలో 20 మంది

ఈరోజు ఉ.10 గంటలకు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు మొదలవ్వనున్నాయి. మొత్తం 97మంది <<17313160>>కార్పొరేటర్లు<<>> ఉండగా.. కూటమి తరుఫున 10 మంది, వైసీపీ తరఫున 10మంది పోటీలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. జనసేనలో ఒకరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్నికకు తాను దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రకటించారు. మరో కార్పొరేటర్ బి.గంగారావు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని సమాచారం.
News August 6, 2025
ఏయూ: క్వాంటం కంప్యూటింగ్‌పై ఎఫ్‌డిపి శిక్షణ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్‌పై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను AU వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు క్వాంటం కంప్యూటింగ్ ఇన్సైట్స్ ఫర్ అకడమీషన్స్-కాన్సెప్ట్, అప్లికేషన్స్ అండ్ టూల్స్ అనే అంశంపై ఎఫ్.డి.పి నిర్వహించనున్నారు.