News August 5, 2025

P4 మార్గదర్శుల ఎంపికలో వ్యతిరేకత రాకూడదు: CM CBN

image

AP: ఈ నెల 19 నుంచి P4 అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో CM చంద్రబాబు అన్నారు. ‘పేదరిక నిర్మూలనలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టాం. మార్గదర్శుల ఎంపికలో వ్యతిరేకత రాకూడదు. మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం చేయవద్దు. P4పై వ్యతిరేకత తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. గతంలో శ్రమదానం, నీరు-మీరునూ ఇలాగే విమర్శించారు’ అని సీఎం తెలిపారు.

Similar News

News January 20, 2026

‘జన నాయగన్’పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

image

విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ దాఖలు చేసిన అప్పీల్‌పై తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.

News January 20, 2026

వెండితో వెడ్డింగ్ కార్డు.. ధర ఎంతో తెలిస్తే షాకే!

image

జైపూర్‌(RJ)లో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వెడ్డింగ్ కార్డ్ చేయించారు. దీని ధర అక్షరాలా ₹25 లక్షలు. శివ్ జోహ్రీ అనే వ్యక్తి ఏడాది పాటు కష్టపడి, ఒక్క మేకు కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇందులో మొత్తం 65 మంది దేవుళ్ల ప్రతిమలను చెక్కించారు. తన కూతురి పెళ్లికి బంధువులతో పాటు సకల దేవతలను ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట.

News January 20, 2026

చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

image

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.