News August 5, 2025

సోనూసూద్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు హర్షం

image

తమ కుటుంబానికి అండగా ఉంటానని సోనూసూద్ భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి దశదిన కర్మకు రూ.1.5లక్షలు ఇచ్చారని, అందువల్లే గ్రాండ్‌గా కార్యక్రమం జరిగిందని చెప్పారు. తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనూసూద్ చెప్పారన్నారు. ఇటీవల చనిపోయిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్, వెంకట్ తనకు సోదరుడిలాంటి వారని చెప్పారు. ఆ కుటుంబానికి పర్సనల్ నంబర్ ఇచ్చారు.

Similar News

News August 6, 2025

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

image

భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్ నియామకాలకు <>నోటిఫికేషన్ <<>>విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 50శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమాతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కల్గిన వారు అర్హులు. 152 సెం.మీ ఎత్తు ఉండాలి. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. ట్రయల్స్ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు, మెడికల్ సెప్టెంబర్ 15 నుంచి జరుగుతాయి.

News August 6, 2025

భారత బౌలర్లు వాజిలిన్ రాశారేమో.. పాక్ మాజీ క్రికెటర్ అక్కసు

image

ENGపై ఐదో టెస్టులో భారత విజయంపై పాక్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. IND బౌలర్లు బాల్ ట్యాంపర్ చేసేందుకు వాజిలిన్ రాసి ఉంటారని ఆరోపించారు. అందుకే 80 ఓవర్ల తర్వాత కూడా బాల్ కొత్తదానిలా మెరుస్తూ ఉందన్నారు. అంపైర్లు ఆ బంతిని టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపాలన్నారు. చట్టవిరుద్ధమైన బౌలింగ్‌తో ఏడాది నిషేధానికి గురైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావా అని భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News August 6, 2025

సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం: అనిల్

image

కొందరు నిర్మాతలు సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని వ్యాఖ్యానించారు. తాము నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. తమకు స్కిల్ లేదనడం సరికాదని, ఇక్కడ ఉన్నవాళ్లకు పని కల్పించి తర్వాత పక్క రాష్ట్రం వాళ్లను తెచ్చుకోవాలని సూచించారు. తమ సమస్యలను వివరించేందుకు ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశముంది. నిన్న నిర్మాతలు ఆయనను కలిశారు.