News August 5, 2025
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు

AP: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన RTC అందుబాటులోకి తేనుంది. AMVTI, ATP, CUD, NLR, GNT, VJW, RJY, KKD, VSP, KRNL, TPT డిపోల నుంచి ఇవి తిరగనున్నాయి. వీటికోసం కేంద్రం అందించే రూ.190కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. ఒక్కో స్టేషన్‌కు రూ.4కోట్లు ఖర్చవుతుందని, డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News August 6, 2025
ఆగస్టు 6: చరిత్రలో ఈరోజు

1881: పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం
1925: భారత జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ ఎ.జీ. కృపాల్ సింగ్ జననం
1934: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జననం
1945: హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి
2019: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం
2023: ప్రజా గాయకుడు గద్దర్ మరణం
News August 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 6, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.40 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.57 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.47 గంటలకు
✒ ఇష: రాత్రి 8.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 6, 2025
ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు

APలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న నీలం రంగు బదులుగా తెలుపు, ఎరుపు, పసుపు రంగుల సమ్మేళనంతో, రిఫ్లెక్టివ్ టేపులతో కొత్త వాటిని తయారు చేస్తున్నారు. ఈ అంబులెన్సులకు సంజీవని అనే పేరు పెట్టారు. వీటి తయారీ పనులు కృష్ణా జిల్లాలోని కుశలవ్ కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. మొదటి విడతలో 104 ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.