News August 5, 2025

రేపు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం

image

ప్రకాశం జిల్లాలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం ప్రకటించింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం బుధవారం ఉన్నట్లు ప్రకటించారు.

Similar News

News September 10, 2025

తర్లుపాడు MPDOపై సస్పెన్షన్ వేటు

image

తర్లుపాడు MPDO చక్రపాణి ప్రసాద్‌పై పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చక్రపాణిపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. MPDOపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కమిటీ విచారణ, ప్రాథమిక సాక్ష్యంతో సస్పెండ్ చేశారు.

News September 10, 2025

ప్రకాశం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్‌లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

News September 10, 2025

ఒంగోలు: బడి ఈడు పిల్లలు బడికి వెళ్లేలా చూడాలి

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అభ్యసించాలని అన్నారు. మంగళవారం ఒంగోలు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ‘లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులపై మాట్లాడారు. జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.