News March 31, 2024

పోటీ పడుతున్న వదినా మరదళ్లు.. గెలిచేదెవరో?

image

మహారాష్ట్రలోని బారామతిలో శరద్ పవార్ కుటుంబ సభ్యుల మధ్యే లోక్‌సభ పోరు జరగనుంది. ఈ స్థానానికి శరద్ కూతురు, MP సుప్రియా సూలేతో అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ పడనున్నారు. వీరిద్దరూ వరుసకు వదినా మరదళ్లు. NCP(SP) (ఇండియా కూటమి) అభ్యర్థిగా సుప్రియా, NDA (శివసేన, BJP, NCP) అభ్యర్థిగా సునేత్ర ఎన్నికల బరిలో దిగుతున్నారు. గతేడాది అజిత్ NCPని చీల్చి NDAలో చేరిన సంగతి తెలిసిందే. #<<-se>>#Elections2024<<>>

Similar News

News March 11, 2026

జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

image

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News March 11, 2026

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

image

AP: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.

News March 11, 2026

ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.