News August 5, 2025
BREAKING: సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్

పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ సమీపంలో కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ శత్రువులకు దీటుగా బదులిచ్చింది. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే తొలిసారి.
Similar News
News August 7, 2025
‘గాఢ నిద్ర’ ఎందుకు అవసరమంటే?

మనిషికి గాఢ నిద్ర(డీప్ స్లీప్)ఎంతో అవసరమని వైద్యులు చెప్తున్నారు. ‘రోజూ 8 గంటలు పడుకున్నా గాఢ నిద్ర మాత్రం 60-100(20%) ని.లు మాత్రమే ఉంటుంది. ఆ సమయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కండరాలు, ఎముకలు, కణజాలాల మరమ్మతుకు గాఢ నిద్ర సహాయ పడుతుంది. ఇమ్యూనిటీ, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకోవడంతో గాఢ నిద్ర సమయం పెరుగుతుంది’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News August 7, 2025
ఉపరితల ఆవర్తనం.. 2 రోజులు భారీ వర్షాలు

AP: రాయలసీమతో పాటు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
News August 6, 2025
కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ MLA

TG: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. తనను చంపుతామని బెదిరింపులు వచ్చినా ఆయన పట్టించుకోలేదని వాపోయారు. ‘2009లో బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. 2014, 2018లోనూ ఎంపీ బీఫామ్ ఇవ్వాలని చూశారు. అచ్చంపేటలో నాపై దాడులు జరిగినా ప్రశ్నించలేదు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో పట్టించుకోలేదు’ అని విమర్శలు చేశారు.