News August 5, 2025
రిసిప్టులను 10 సెకన్లకు మించి పట్టుకుంటున్నారా?

బిల్లు రిసిప్టులను 10 సెకన్లకు మించి చేతితో పట్టుకుంటే సంతాన సామర్థ్యం తగ్గుతుందని స్పెయిన్‌లోని గ్రెనడా యూనివర్సిటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. బిస్ఫెనాల్ A(BPA) లేదా బిస్ఫెనాల్ S వంటి రసాయనాలతో చేసే థర్మల్ పేపర్‌పై బిల్స్ ముద్రిస్తారు. ఇవి చర్మం ద్వారా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుని, వీర్య కణాల సంఖ్య&నాణ్యతను తగ్గిస్తాయని తేలింది.
Similar News
News January 23, 2026
RCBని కొనేందుకు బిడ్ వేస్తా: అదర్ పూనావాలా

IPL ఫ్రాంచైజీ RCBని అమ్మేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీమ్‌ను కొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదర్ పూనావాలా కూడా ఉన్నారు. ఆయన ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ‘IPLలో అత్యుత్తమ జట్లలో ఒకటైన RCB ఫ్రాంచైజీని కొనేందుకు రానున్న నెలల్లో బలమైన, పోటీతో కూడిన బిడ్ వేస్తా’ అని పూనావాలా ట్వీట్ చేశారు.
News January 23, 2026
IIIT డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

IIIT DM కర్నూలులో 16 నాన్ టీచింగ్, 10 టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech/MSc/MCA, ME/MTech, MBA, BSc నర్సింగ్, B.PEd, డిప్లొమా, ITI, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నాన్ టీచింగ్ పోస్టులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా, టీచింగ్ పోస్టులను షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, PPT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitk.ac.in
News January 23, 2026
నేడు విద్యా సామగ్రిని పూజిస్తే..?

వసంత పంచమి జ్ఞానానికి సంకేతం. అందుకే విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులని సరస్వతీ దేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. తద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని నమ్మకం. అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు ఇది శ్రేష్టమైన సమయం. చదువుకునే వారే కాకుండా, మేధోవృత్తుల్లో ఉన్నవారు కూడా తమ వృత్తికి సంబంధించిన డైరీలు, పరికరాలను పూజిస్తే ఆ ఏడాది అంతా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది.


