News August 6, 2025
ఖాతాదారులకు HDFC బ్యాంక్ హెచ్చరికలు

APK ఫైల్ స్కామ్‌పై HDFC బ్యాంక్ తమ ఖాతాదారులను హెచ్చరించింది. ‘స్కామర్లు మీకు బ్యాంకు సిబ్బందిలా APK ఫైల్స్ పంపుతారు. అవి డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాలవుతుంది. మీ కాల్స్, డేటా వారికి చేరుతుంది. రీ-కేవైసీ, పెండింగ్ చలాన్లు, ట్యాక్స్ రిటర్న్స్ అని వచ్చే లింక్స్ క్లిక్ చేయకండి. థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి. మోసపూరిత లింక్స్, మెసేజులు వస్తే రిపోర్ట్ చేయండి’ అని సూచించింది.
Similar News
News August 6, 2025
ఉత్తరకాశీ విపత్తు.. రంగంలోకి దిగిన IAF

ఉత్తరకాశీలో ధరాలీ, హర్సిల్ ప్రాంతాలను వరద <<17311127>>ప్రవాహం<<>> ముంచెత్తిన విషయం తెలిసిందే. సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. UP బరేలీ స్టేషన్‌లోని Mi-17s, ALH Mk-III చాపర్లను హై అలర్ట్‌లో ఉంచింది. ఆగ్రా నుంచి An-32s, C295s మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో రిలీఫ్, రెస్క్యూ సామగ్రిని డెహ్రాడూన్‌కు పంపింది. వాతావరణం సహకరించనప్పటికీ జాయింట్ సివిల్-మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు IAF వెల్లడించింది.
News August 6, 2025
క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

AP: క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 15 నుంచి RTC బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాఖీ బహుమతిగా ఈ పథకాన్ని అందివ్వనుంది. కొత్త బార్ పాలసీని క్యాబినెట్ ఆమోదించింది. కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు కేటాయించనుంది. జనగణన మొదలయ్యేలోగా జిల్లాల పునర్విభజనలో సరిహద్దు సమస్యలపై నివేదికివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
News August 6, 2025
ముందస్తు చర్యలు తీసుకుంటే తొక్కిసలాట జరిగేది కాదు: NHRC

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై పోలీసుల నివేదికపై NHRC అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని CSకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘ప్రీమియర్ షోకు పోలీసుల అనుమతిలేదని రిపోర్టులో చెప్పారు. నటుడు, ఫ్యాన్స్ ఎందుకు వచ్చారు? ముందే చర్యలు తీసుకొంటే తొక్కిసలాట జరిగేది కాదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి 6వారాల్లో మరో నివేదిక ఇవ్వండి’ అని ఆదేశించింది.