News March 31, 2024
నూజివీడు అసెంబ్లీకి 72 ఏళ్లలో ఐదుగురే అభ్యర్థులు

నూజివీడు నియోజకవర్గం నుంచి 72 ఏళ్లలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు, 3 సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1972వరకు డాక్టర్ ఎంఆర్ అప్పారావు, 1978, 1989లో పాలడుగు వెంకటరావు, 1983, 1985, 1994, 1999లో కోటగిరి హనుమంతరావు, 2004, 2014, 2019లో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, 2009లో చిన్నం రామకోటయ్య గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News April 19, 2025
VJA: లాయర్ల మధ్య వివాదం

విజయవాడ కోర్టులో ఇద్దరు మహిళా న్యాయవాదుల గొడవ పడిన ఘటన చోటు చేసుకుంది. జూనియర్ లాయర్ మనిప్రియ మాట్లాడుతూ.. సీనియర్ లాయర్లు సౌందర్య, పిట్టల శ్రీనివాస్ కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని నిరసన తెలిపారు. సౌందర్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనిప్రియపై 307 కేసు ఉందని, ఆమె జడ్జి ఎదుట అసభ్యంగా మాట్లాడి, బట్టలు చింపుకొని గొడవ చేసిందన్నారు. దీనిపై బార్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.
News April 19, 2025
క్రికెట్ బెట్టింగ్.. చల్లపల్లిలో ఏడుగురు అరెస్ట్

చల్లపల్లిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆదేశాల మేరకు సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ జూదరులను గుర్తించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
News April 19, 2025
గన్నవరం: లారీ డ్రైవర్‌కు గుండె పోటు.. ఇద్దరి దుర్మరణం

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదం పాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.