News August 6, 2025
కోర్టుకు ఏం చెప్పాలనేదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు!

TG: సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నెలన్నర క్రితం హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం పంపిన BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఎటూ తేల్చలేదు. రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న సర్కారు హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. తాజాగా CS రామకృష్ణారావు న్యాయనిపుణులతో భేటీ అయి కోర్టును మరింత సమయం కోరే అంశాలపై చర్చించారు.
Similar News
News August 6, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
News August 6, 2025
లిక్కర్ కేసులో దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు: CM చంద్రబాబు

AP: లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులు మాట్లాడొద్దని CM చంద్రబాబు సూచించారు. దర్యాప్తు ఆధారంగానే ఆ కేసులో అరెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏడాది హాలిడే ముగిసిందని, ఇకపై అంతా పూర్తిస్థాయిలో యాక్టివేట్ అవ్వాలని పిలుపునిచ్చారు. చేసిన ప్రగతి చెప్పకపోతే నష్టపోతామని తెలిపారు. మంత్రులు తమ శాఖల్లో తీసుకున్న చర్యలు, వారు చేసిన అభివృద్ధిపై వచ్చే క్యాబినెట్ భేటీలో ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
News August 6, 2025
అందుకే ‘వార్ 2’ మూవీ చేశా: Jr.NTR

నటనలో తనను తాను సవాల్ చేసుకొనే పాత్రలో నటించాలన్న ఉద్దేశంతోనే వార్2కు ఒప్పుకున్నానని ఎన్టీఆర్ అన్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఈ చిత్రం కోసం సౌత్, నార్త్ నుంచి అందరు టెక్నీషియన్స్ కలిసి పనిచేశారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనేవి లేవు. అందరూ ఇండియన్ మూవీ ఇండస్ట్రీగా కలిసి పనిచేయాలి. బలమైన కథ కావడం కూడా నేను వార్ 2 చిత్రం ఒప్పుకోవడానికి కారణం’ అని తెలిపారు.