News August 6, 2025

TODAY HEADLINES

image

*ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో చంద్రబాబు రివ్యూ
*అమరావతి నిర్మాణంలో అవినీతి: జగన్
*మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను: వెంకటరెడ్డి
*EVMలు వద్దు.. బ్యాలట్ పద్ధతి తీసుకురావాలి: KTR
*జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
*ఉత్తరకాశీ వరదల్లో 11మంది జవాన్లు గల్లంతు
*ఆల్‌టైమ్ రికార్డ్.. ఒక్క రోజులో 70 కోట్ల UPI పేమెంట్స్
*భవిష్యత్తులో ఫార్మారంగంపై 250% టారిఫ్స్: ట్రంప్

Similar News

News August 17, 2025

BCCI కొత్త రూల్.. ICC అనుసరించాలా?

image

BCCI కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి డొమెస్టిక్ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఏ ప్లేయరైనా గాయపడి, ఆడలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ఈ రూల్ మల్టీ డే(వన్డే, టీ20లు కాకుండా) ఫార్మాట్‌ మ్యాచ్‌లకే వర్తిస్తుంది. ఇటీవల ENGతో టెస్ట్ సిరీస్‌లో పంత్, వోక్స్‌ తీవ్ర గాయంతో ఆడటానికి ఇబ్బందిపడిన నేపథ్యంలో ICC కూడా దీన్ని అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?

News August 17, 2025

గీత కార్మికులకు త్వరలో ద్విచక్ర వాహనాలు: మంత్రి

image

AP: గీత కార్మికుల కోసం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ స్కీమ్ కింద వారికి ద్విచక్ర వాహనాలు (మోపెడ్) అందజేస్తామన్నారు. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు ఇస్తామని చెప్పారు. రంపచోడవరం హార్టికల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారు చేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని CM ఆదేశించినట్లు పేర్కొన్నారు.

News August 17, 2025

మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయే నిజాలు

image

మేడ్చల్ సరోగసీ <<17424309>>కేసులో<<>> మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశముంది. నిందితురాలు లక్ష్మీకి HYDలో పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. IVF సెంటర్ల రికార్డులను పరిశీలించనున్నారు. లక్ష్మీ 50 మందికి పైగా సరోగసీ చేయించినట్లు తెలుస్తోంది. అండాలు ఇస్తే ₹30 వేలు, పిల్లలను కనిస్తే ₹4 లక్షలు ఇస్తూ దందా చేసినట్లు సమాచారం. ఆమెపై ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు.