News March 31, 2024
కర్నూలులో ఏడాది క్రితం మిస్సైన మూడు కూనలు హైదరాబాద్‌లో సేఫ్

కర్నూలు జిల్లాలో 2023 మార్చిలో నాలుగు పులి పిల్లలు మిస్ అయ్యాయి. అయితే వాటిని తిరుపతి SV జూ పార్క్‌కు తరలించి అధికారులు సంరక్షించారు. వాటిలో ఒకటి మరణించగా మరో మూడింటికీ రుద్రమ్మ, అనంత, హరిణి అని పేరు పెట్టారు. వీటిని ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన జీఏఆర్ సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. గడువు ముగిస్తే మళ్లీ అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని SVజూపార్క్ క్యూరేటర్ సెల్వం తెలిపారు.
Similar News
News March 28, 2025
రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.
News March 28, 2025
‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

కర్నూలులోని ‘సాక్షి’ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీకి సవాల్ విసిరారు. ‘చికెన్ షాపుల నుంచి మేము కిలోకు రూ.10 తీసుకుంటున్నట్లు నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా. లేదంటే నాపై రాసిన వార్తలన్నీ తప్పని ప్రచురించాలి. నాపై ఇలాంటి వార్తలు రాయడం తగదు’ అంటూ ఆమె హెచ్చరించారు. కాగా నిన్న సాక్షి కార్యాలయం ముందు కోళ్ల వ్యర్థాలు, చెత్త పడేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
News March 28, 2025
2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 800 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆరుగురు DSPలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 1,500 సివిల్ పోలీస్ సిబ్బంది, 200 మంది ఆర్మ్‌డ్, 200 మంది APSP, 100 మంది స్పెషల్ పార్టీ మొత్తంగా 2 వేలకు పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.