News March 31, 2024
పెరిగిన టోల్‌ఫీజు
HYD- విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద ఫీజులు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ.5 నుంచి రూ.40, స్థానికుల నెలవారీ పాసులు రూ.330 నుంచి రూ.340కి పెరిగాయి. ఆందోల్ నుంచి చిల్లకల్లు వరకు రహదారిని కాంట్రాక్ట్ సంస్థ GMR రూ.2000 కోట్లతో 4లేన్లుగా విస్తరించింది. ఈ వ్యయాన్ని రాబట్టుకునేందుకు ఫీజులు పెంచింది. ఏడాది పాటు ఇవే ఛార్జీలుంటాయి.
Similar News
News November 7, 2024
వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు
AP: వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్‌ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు. ‘వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య’ అని ఆయన మాట్లాడారు.
News November 7, 2024
STOCK MARKETS: రూ.3.5లక్షల కోట్ల నష్టం
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.
News November 7, 2024
ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’
సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీల కోసం నిన్న ముంబైలో ప్రివ్యూ షో వేయగా షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతిశెట్టి, సందీప్ కిషన్ తదితరులు వీక్షించారు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అంటూ కితాబిచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు.